శనివారం 04 జూలై 2020
National - Jun 25, 2020 , 09:58:18

మార్కెట్‌లో న‌టుడి వింత డ్యాన్స్‌.. కూర‌గాయ‌లు అమ్మ‌డానికేనా?

మార్కెట్‌లో న‌టుడి  వింత డ్యాన్స్‌.. కూర‌గాయ‌లు అమ్మ‌డానికేనా?

వ్యాపారం బాగా జ‌ర‌గ‌డానికి అమ్మ‌కదారులు విచిత్రమైన ప్ర‌యోగాలు చేస్తుంటారు. అలాచేస్తే గా‌ని క‌స్ట‌మ‌ర్ల దృష్టిని ఆక‌ర్షించ‌లేరు. అలా ఓ అమ్మ‌క‌దారుడు కొత్తిమీర‌ను చేతిలో ప‌ట్టుకొని ఛీర్‌గ‌ర్ల్స్ చేసిన విధంగా డ్యాన్స్ చేస్తూ అమ్ముతున్నాడు. ఈ డ్యాన్స్ ఐపిఎల్ మ్యాచ్‌ను గుర్తు చేస్తున్న‌ది. రోషన్ షింగే ఒక కూరగాయల అమ్మకందారుని పాత్రను పోషించి, కొత్తిమీర‌ను ఈ పద్ధతిలో విక్రయించడం ఇదే మొదటిసారి కాద‌ట‌.

క‌రోనా వైర‌స్ కార‌ణంగా వాయిదా ప‌డిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మ్యాచ్‌ను త‌ల‌పించే విధంగా ఈ డ్యాన్స్ ఉంది.  14 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో అత‌ను తెల్ల‌ని షార్ట్ ప్యాంట్‌, రెడ్ క‌ల‌ర్ ష‌ర్ట్ ధ‌రించి ఉన్నాడు. కొత్తిమీర క‌ట్ట రూ. 14కు అమ్మే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అత‌ని డ్యాన్స్ అంద‌రినీ అబ్బుర‌ప‌రుస్తున్న‌ది. 'కొంత‌మంది ఐపీఎల్‌ను మిస్ అవుతున్నారు అనే క్యాప్ష‌న్'‌తో స్మితా దేశ్‌ముఖ్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. అత‌ను గొప్ప అమ్మ‌క‌పు వ్య‌క్తి అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకో విష‌యం ఇత‌ను ముంబైకు చెందిన న‌టుడు అని కూడా చెప్పుకొచ్చింది. 


logo