శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 04, 2020 , 16:40:27

ప్రాణాల‌కు తెగించి తోడేలును కాపాడిన వ్య‌క్తి : వీడియో వైర‌ల్

ప్రాణాల‌కు తెగించి తోడేలును కాపాడిన వ్య‌క్తి :  వీడియో వైర‌ల్

మ‌నిషి ప్రాణాలు పోతుంటేనే ప‌ట్టించుకోని ఈ రోజుల్లో ఎక్క‌డో అడ‌విలోని తోడేలును కాపాడ‌టానికి ప్రాణాల‌ను సైతం లెక్కచేయ‌లేదు ఓ వ్య‌క్తి. ఈ వీడియో చూసిన త‌ర్వాత నెటిజ‌న్లు నివ్వెర‌పోయారు. ఈ వీడియోను ఇండియ‌న్ పారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

52 సెకండ్ల వీడియో చూసినట్ల‌యితే ఒక ఉచ్చులో తోడేలు కాళ్లు చిక్కుకున్నాయి. జంతువు నొప్పితో బాధ‌ప‌డుతుంటే దానిని ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశాడు. అందుకోసం ఒక క‌ర్ర‌ను ఉప‌యోగించాడు. ఆ త‌ర్వాత త‌న చేతితో తోడేలు కాలు నుంచి బ‌య‌ట‌కు తీశాడు. తీసిన వెంట‌నే తోడేలు బ‌య‌ట ప‌డ్డానురా దేవుడా.. అంటూ అక్క‌డి నుంచి ఎస్కేప్ అయింది. ఈ వీడియో కొన్ని గంట‌ల‌కే వైర‌ల్ అయింది.