ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Aug 14, 2020 , 20:37:41

ఎవ‌రూ చూడ‌ట్లేద‌ని శానిటైజ‌ర్‌ను లుంగీలో దాచాడు! తీరా సీసీకెమెరా ఉండ‌డంతో..

ఎవ‌రూ చూడ‌ట్లేద‌ని శానిటైజ‌ర్‌ను లుంగీలో దాచాడు! తీరా సీసీకెమెరా ఉండ‌డంతో..

క‌రోనా నేప‌థ్యంలో వేటికీ లేని గిరాకి శానిటైజ‌ర్‌కు ఉంది. ఎక్క‌డికి వెళ్లినా చేతిలో ఫోన్ ఉన్నా లేకున్నా శానిటైజ‌ర్ మాత్రం ఉండాలి. అందుకే దీనికి అంత డిమాండ్‌. మ‌రి రోజూ వాడేవారికి ఒక బాటిల్ శానిటైజ‌ర్ అయినా కావాలి క‌దా. అందుకే ఎక్క‌డ ఫ్రీగా దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఫ్రీగా ఎవ‌రు పోస్తారు. క‌నిపించిన‌ప్పుడు దోచుకోవాల్సిందే అనుకున్నాడేమో ఈ ప్ర‌బుద్దుడు.. షాపు ఎదురుగా ఉన్న శానిటైజ‌ర్‌ను నొక్కేశాడు. కేర‌ళ‌కు చెందిన ఓ వ్య‌క్తి షాపు ముందు క‌స్ట‌మ‌ర్ల కోసం పెట్టిన శానిటైజ‌ర్ బాటిల్‌ను చూశాడు. దాన్ని నొక్కేయ‌డానికి ఫోన్‌లో ఎవ‌రితోనే మాట్లాడుతున్న‌ట్లుగా అక్క‌డికి వ‌చ్చి కాసేపు నిలబ‌డ్డాడు.

ఎవ‌రూ చూడ‌ని స‌మ‌యంలో తెచ్చుకున్న బాటిలోకి శానిటైజ‌ర్‌ను నింపేసుకున్నాడు. అంతే.. సైగ్గా లుంగీలో దాచేశాడు. ఇక బ‌య‌లు దేరుదాం అనుకునేస‌రికి ఎదురుగా సీసీకెమెరా క‌నిపించింది. ఇంకేముంది.. బండారం బ‌య‌ట‌ప‌డింది రా దేవుడా అనుకుంటూ త‌న బాటిల్‌లోని శానిటైజ‌ర్‌ను అందులోనే నింపేసి అక్క‌డి నుంచి ఎస్కేప్ అయ్యాడు‌. ఈ క్ర‌మంలో అత‌ను క‌నిపించ‌కుండా ఉండేందుకు ముక్కు కింద‌కు క‌ట్టుకున్న మాస్క్‌ను బాగా స‌రిచేసుకున్నాడు. ఏదైతేనేం ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసి ఈ వ్య‌క్తిని బాగా పాపుల‌ర్ చేశారు. 


logo