శనివారం 23 జనవరి 2021
National - Dec 20, 2020 , 11:32:59

దవాఖానపై పికప్‌ వ్యాన్‌తో దాడి

దవాఖానపై పికప్‌ వ్యాన్‌తో దాడి

న్యూఢిల్లీ: దేశ రాజధాని శివార్లలో ఉన్న దవాఖానపై ఓ వ్యక్తి పికప్‌ వ్యాన్‌తో దాడికిదిగాడు. గురుగ్రామ్‌లోని బసాయ్‌ చౌక్‌లో ఉన్న బాలాజీ దవాఖానలో ఇద్దరు వృద్ధులు చికిత్స పొందుతు న్నారు. వారి చికిత్స విషయంలో దవాఖా సిబ్బందికి, వారి కుటుంబీకులకు మధ్య నిన్న రాత్రి చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. ఆ ఘర్షణను మనసులో పెట్టుకున్న సదరు వ్యక్తి తన పికప్‌ వ్యాన్‌తో దవాఖాన వద్ద వీరంగం సృష్టించాడు. పికప్‌ ట్రక్కుతో హాస్పిటల్‌పైకి దూసుకొచ్చాడు. ఏడు నుంచి ఎనిమిది సార్లు దవాఖానును ఢీకొట్టించాడు. దీంతో దవాఖాన ఆవరణలోని మెడికల్‌ షాపు పాక్షికంగా ధ్వంసమయ్యింది. ఈ క్రమంలో హాస్పిటల్‌ ముందు ఆగి ఉన్న సుమారు 10 నుంచి 15 వాహనాలు పాడయ్యాయి.  

ఓ వ్యక్తి వ్యాన్‌తో ఏడెనిమిది సార్లు హాస్పిటల్‌ను ఢీకొట్టించాడని, దీంతో మెడికల్‌ షాపుతోపాటు 10 నుంచి 15 వాహనాలు దెబ్బతిన్నాయని బాలాజీ దవాఖాన చైర్మన్‌ డా.బల్వాన్‌ సింగ్ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించామని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు.


logo