న్యూఢిల్లీ : హోటల్‌కు వెళ్తే అక్కడ పని చేసేవాళ్లకు టిప్పు ఎంత ఇస్తారు.. 10 రూపాయలు.. 20 రూపాయలు.. కొంచెం బిల్లు ఎక్కువ అనుకొంటే 100 రూపాయలు. అమెరికాలోని న్యూహాంప్షైర్లో ఓ కస్టమర్ దాదాపు 12 లక్షల రూపాయల (16వేల డాలర్లు) టిప్పు ఇచ్చారు. కరోనా కారణంగా హోటల్ నష్టాల్లో కూరుకుపోయిందని గమనించిన ఆ కస్టమర్ టిప్పు రూపంలో తన ఉదారతను చాటుకొన్నారు. క్రెడిట్ కార్డుతో చెల్లించిన బిల్లును చూసి హోటల్ యజమాని… పొరపాటున అంత డబ్బు ఇచ్చాడేమో అనుకుని కస్టమర్‌ను పిలిచి అడిగాడు. పొరపాటు కాదని ఆ కస్టమర్ చెప్పే సరికి ఆశ్చర్యపోయాడు. ఇంతకీ హోటల్లో ఆ కస్టమర్ చేసిన బిల్లు రూ.2,968.