ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 14, 2020 , 13:15:41

పారాచూట్‌లో షికార్లు.. బిల్డింగ్‌ను ఢీ కొట్టాడు..వీడియో వైర‌ల్‌!

పారాచూట్‌లో షికార్లు.. బిల్డింగ్‌ను ఢీ కొట్టాడు..వీడియో వైర‌ల్‌!

న‌గ‌రం మ‌ధ్య‌లో పారాచూట్‌తో షికార్లు కొడుతున్న ఒక వ్య‌క్తి భ‌వ‌నాన్ని ఢీ కొట్టాడు. దీంతో పారాచూట్ భ‌వ‌నానికి మ‌ధ్య‌లో ఇరుక్కుపోయింది. అగ్నిమాప‌క సిబ్బంది వ‌చ్చేస‌రికి చాలాస‌మ‌య‌మే ప‌ట్టింది. అప్ప‌టివ‌ర‌కు అత‌ను గాల్లోనే ఉన్నాడు. ఈ సంఘ‌ట‌న‌ను అక్క‌డున్న ఒక వీక్ష‌కుడు చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే.. ఆన్‌లైన్‌లోకి వ‌చ్చిన కాసేప‌టికే వీడియో వైర‌ల్‌గా మారింది.

క్లేవ్‌ల్యాండ్ అగ్నిమాపక సిబ్బంది ఆ వ్యక్తిని భవనం నుంచి రక్షించి హాస్పిట‌ల్‌లో చేర్పించారు. అప్పుడు 35 ఏండ్ల బాధితుడి నుంచి కొన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇత‌నితోపాటు న‌లుగురు స్నేహితులు ఆదివారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు విమానం నుంచి పారాచూట్ సాయంతో కిందకి దూకిన‌ట్లు పోలీసుల‌కు చెప్పుకొచ్చాడు. కానీ ఇత‌న్ని చూసిన కొంత‌మంది సాక్ష్యులు మాత్రం స‌మీప భ‌వ‌నం పైక‌ప్పు నుంచి దూక‌డం చూశామ‌ని చెబుతున్నారు. ఈ విష‌యంపై ఇంకా చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. ఇత‌నితోపాటు దూకిన న‌లుగురు స్నేహితులు సుర‌క్షితంగా ఒక పార్కులో దిగ‌డంతో వారికి గాయాలు కాలేద‌ని పోలీసులు తెలిపారు. 


logo