గురువారం 03 డిసెంబర్ 2020
National - Aug 24, 2020 , 19:54:40

దోశ అంటే ఇష్ట‌మైన వాళ్లు ఈ వీడియో చూడ‌క‌పోవ‌డ‌మే మంచిది!

దోశ అంటే ఇష్ట‌మైన వాళ్లు ఈ వీడియో చూడ‌క‌పోవ‌డ‌మే మంచిది!

ద‌క్షిణ భార‌తీయుల‌కు ఇష్ట‌మైన బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ మొద‌టిదే. అంతేకాదు పండుగ వ‌చ్చిన పబ్బం వ‌చ్చినా ఇంట్లో త‌ప్ప‌నిస‌రిగా దోశ పోయాల్సిందే. అంత‌టి ప్రాముఖ్య‌త క‌లిగున్న దోశ‌ను రూపురేఖ‌లు లేకుండా చేస్తే ఊరుకుంటారా?  దోశ మాత్ర‌మే కాదు. ఇందులో చాలా ర‌కాలు ఉన్నాయి. ఆనియ‌న్ దోశ‌, ప్లేన్ దోశ‌, మ‌సాలా దోశ, ఉప్మా దోశ అంటూ ర‌క‌ర‌కాల వెరైటీలే ఉన్నాయి. అలాంటి దోశ‌ను ఓ వ్య‌క్తి ఖూనీ చేసేశాడు.

ముందుగా ఒక దోశ పోసి దాని మీద పాస్తా, వెన్న, ర‌క‌ర‌కాల సాస్‌లు వేస్తూ దోశ రూపాన్నే మార్చేశాడు. దాన్ని చాట్ త‌యారు చేసిన‌ట్లుగా చేసి ముక్క‌లుగా క‌ట్ చేశాడు. వైరైటీల‌ను ఇష్ట‌ప‌డేవారు త‌ప్ప దోశను ఇష్ట‌ప‌డేవాళ్లు దీనిని అంగీక‌రించ‌రు. మార్కెట్‌లో దొరికే అన్ని ర‌కాలు వేసేసి దానికి రెడ్‌సాస్ పాస్తా దోశ అని పేరు పెట్టారు. ఆర్‌డిఎక్స్ అనే ట్విట‌ర్ యూజ‌ర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. వైరైటీ దోశ‌ను చూడాల‌నుకునేవారు మాత్ర‌మే ఈ వీడియోను చూడండి.