నాగ్‌పూర్: మద్యం తాగివచ్చి తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడని అన్నను చంపాడో తమ్ముడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన చంద్రశేఖర్ బదాఖల్, గణేశ్ అన్నాదమ్ముళ్లు. 34 చంద్రశేఖర్‌కు వివాహం కాలేదు. నాగ్‌పూర్‌లోని ఓ పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో ఆయన పనిచేస్తున్న ఆయన తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ప్రతిరోజు తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడు. దీంతో ఓపిక నషించిన గణేశ్.. చంద్రశేఖర్‌తో పోట్లాడాడని.. ఆవేశంలో అతడిని హత్యచేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశామన్నారు.