ఆదివారం 31 మే 2020
National - May 10, 2020 , 08:46:39

పామును కాపాడ‌బోయి.. అదే పాము కాటుకు బ‌లి!

పామును కాపాడ‌బోయి.. అదే పాము కాటుకు బ‌లి!

చెన్నై: పాములు ఇంట్లోకి రాకుండా ఒక‌ ఇంటి వెనుక నిర్మించిన కంచెలో చిక్కుకున్న పామును ర‌క్షించ‌బోయి ఓ వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు. త‌మిళ‌నాడు రాష్ట్రం మైలాడుదురై జిల్లా శీర్గాళి సమీపంలోని ఆరపాక్కం గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆర‌పాక్కం గ్రామానికి చెందిన రాజశేఖర్ ‌(35) అనే వ్య‌క్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. శ‌నివారం ఉద‌యం దుకాణం తెరిచిన కొద్దిసేప‌టికే ప‌క్కింట్లో పాము పాము అనే అరుపులు వినిపించాయి. దీంతో అక్క‌డికి వెళ్లిన రాజ‌శేఖ‌ర్ వారి ఇంటి వెనుక నిర్మించిన ఇనుప కంచెలో పాము చిక్కుకుని ఉండ‌టం గ‌మ‌నించాడు. దాన్ని ఇనుప కంచె నుంచి జాగ్ర‌త్త‌గా త‌ప్పించి విడిచిపెడుతుంగానే కాటేసి స‌మీపంలోని పొద‌ల్లోకి వెళ్లిపోయింది. ఇరుగుపొరుగు వారు రాజ‌శేఖ‌ర్‌ను వెంటనే శీర్గాళి ప్రభుత్వ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అత‌న్ని చిదంబరం ప్రభుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజ‌శేఖ‌ర్ మృతిచెందాడు.


logo