శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 22, 2020 , 13:56:10

భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

పాల్ఘర్‌: మహారాష్ట్రలో భార్యను చంపి, తాను ఆత్మహత్యచేసుకున్నాడు ఓ సెక్యూరిటీ గార్డు. పాల్ఘర్‌ జిల్లా వసాయ్‌కు చెందిన జ్యోతి చవాన్‌, రాహుల్‌ చవాన్‌ భార్యాభర్తలు. రాహుల్‌ చవాన్‌ ముంబై సమీపంలో ఉన్న అంధేరీ మెట్రో స్టేషన్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే గత శుక్రవారం రాత్రి అయినప్పటికీ వారింట్లో లైట్లు వెలుగకపోవడంతో పక్కింటివారికి అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులను బద్దలుకొట్టారు. జ్యోతి మంచంపై విగతజీవిగా పడి ఉంది. రాహుల్‌ హాల్‌లో సీలింగ్‌కు వేలాడుతూ కనిపించారు. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవఖానకు తరలించారు. ఆ నివేదిక వచ్చిన తర్వాతే పూర్తివివరాలు తెలస్తాయని ఇన్‌స్పెక్టర్‌ అర్చనా దుసానే తెలిపారు. కాగా, రాహుల్‌ మొదట తన భార్యను చంపి, అతను ఉరివేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు.