సోమవారం 03 ఆగస్టు 2020
National - Jun 11, 2020 , 16:23:39

ఉమ్మి వేయడాన్ని ప్రశ్నించిన వ్యక్తి హత్య

ఉమ్మి వేయడాన్ని ప్రశ్నించిన వ్యక్తి హత్య

న్యూఢిల్లీ: ఉమ్మి వేయడాన్ని ప్రశ్నించిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. మంగళవారం ఓ ఆలయం మార్గంలో ప్రవీణ్‌ ‌ అనే వ్యక్తి ఉమ్మి వేశాడు. గమనించిన అంకిత్‌ అనే మరో వ్యక్తి  దీనిపై అతడ్ని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.

కాగా, బుధవారం రాత్రి  భగత్ సింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద వీరిద్దరు మరోసారి ఘర్షణకు దిగి తీవ్రంగా కొట్టుకున్నారు. గాయపడిన ఇద్దరిని దవాఖానకు తరలించగా అధిక రక్తస్రావం వల్ల అంకిత్ మరణించాడు. హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు ప్రవీణ్‌ను అరెస్ట్‌ చేశారు.  logo