శుక్రవారం 05 జూన్ 2020
National - Apr 02, 2020 , 17:25:55

మాస్కులు,జెల్స్‌ ఎత్తుకెళ్లాడు..6 నెలలు జైలు

మాస్కులు,జెల్స్‌ ఎత్తుకెళ్లాడు..6 నెలలు జైలు

లండన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇపుడు ముఖానికి వేసుకుని మాస్కుల అవసరం పెరిగిన విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఓ వ్యక్తి దొంగతనం చేసేందుకు అంబులెన్స్‌నే టార్గెట్‌ చేసుకున్నాడు. దక్షిణ లండన్‌లోని ఓ ఆస్పత్రికి సమీపంలో ఆగిఉన్న అంబులెన్స్‌లో నుంచి మార్క్‌ మాన్లే (35)అనే వ్యక్తి ఫేష్‌మాస్కులు, ఇతర కిట్స్‌ ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లాడు.

మార్క్‌ మాన్లే ఎత్తుకెళ్లిన బ్యాగులో ఫేస్‌ మాస్కులు, పేపర్‌ షూట్స్‌, హ్యాండ్‌ జెల్స్‌తోపాటు కొన్ని కలుషిత వస్తువులున్నట్లు గుర్తించారు. అతన్ని కోర్టులో హాజరుపర్చగా 6 నెలల జైలుశిక్ష విధించినట్లు మెట్రోపాలిటన్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo