శుక్రవారం 10 జూలై 2020
National - Jun 03, 2020 , 13:16:55

పాము నుంచి తప్పించుకొని పారిపోయిన జింక!

పాము నుంచి తప్పించుకొని పారిపోయిన జింక!

లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి సోషల్‌మీడియాలో ఎక్కువగా మూగజీవాలు, వన్యప్రాణులే కనిపిస్తున్నాయి. వీటిని చూసి కొంతమంది భయపడుతుంటే మరికొంతమంది తప్పు, ఒప్పులంటూ చర్చలు మొదలుపెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియోపై మీ స్పందన ఏంటని పాము, జింకలున్న వీడియోను షేర్‌ చేశాడు ట్విటర్‌ యూజర్‌ వినీత్‌ వశిస్ట్. ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఒక పెద్ద పాము. చూడడానికి చిన్న కొండచిలువలా ఉంది. చాలా పొడువుగా ఉంది. జింకను ఎటూ కదలకుండా చుట్టేసి మింగేయడానికి ప్రయత్నిస్తున్నది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి జింకను రక్షించేందుకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న చెట్టుకొమ్మ సాయంతో పామును కొట్టసాగాడు.  దీంతో పాము అతని మీద కోపంతో ఒక్కసారిగా పైకి లేచి బుసలు కొట్టింది. ఇలా కాదని అతను కొమ్మను పడేసి ఈ సారి కర్రతో పాముని కొట్టాడు. కర్రని చూసి భయపడ్డ పాము జింకని వదిలి వెళ్లిపోయింది. పాము వదిలి వదలంగానే జింక తుర్రుమన్నది. ఈ వీడియోను వినీత్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘మీరేమనుకుంటున్నారు? అతను చేసింది తప్పా, ఒప్పా’ అనే క్యాప్షన్‌ జోడించాడు. ఈ సంఘటన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్‌లో చోటు చేసుకున్నది.


logo