శుక్రవారం 27 నవంబర్ 2020
National - Oct 24, 2020 , 13:57:15

మ్యాన్ హోల్ పేలి... ఇతను గాల్లో ఎంతెత్తుకు ఎగిరాడో....వామ్మో ... !

మ్యాన్ హోల్ పేలి... ఇతను గాల్లో ఎంతెత్తుకు ఎగిరాడో....వామ్మో ... !

హైదరాబాద్ : మ్యాన్‌హోల్స్ ఎంత ప్రమాదకరమో తెలిసే ఉంటుంది.. కానీ ఈ వీడియో ఘటన చూస్తే ఇక ఆ దరిదాపుల్లోకి కూడా మీరు వెళ్లే ప్రయత్నం చేయరు. ఆ పిల్లవాడు చేసిన అల్లరి పనికి అది బాంబులా పేలింది. దీంతో ఆ బాలుడు గాల్లోకి ఎగిరిపడ్డాడు. మ్యాన్‌ హోల్స్ పేలుతాయా?  అనే ప్రశ్నకు ఈ వీడియోనే  సమాధానం. చైనాలోని గాన్సు ప్రావీన్స్‌కు చెందిన ఓ బాలుడు మ్యాన్ హోల్‌లోని చిన్న రంథ్రంలోకి బాణాసంచా వేశాడు.

దీంతో మ్యాన్ హోల్ ఒక్కసారిగా పేలింది. ఆ ప్రభావానికి దానిపై నిలుచున్న బాలుడు సుమారు 10 అడుగులు పైగా గాల్లోకి ఎగిరి అంత దూరంగా పడ్డాడు. లక్ ఏమిటంటే  అతని తల నేలకు తగల్లేదు. దీంతో  బతికిపోయాడు. అయితే 2019లో ఓ బాలుడు ఫుట్‌పాత్‌పై నడుస్తూ బాణాసంచాను మ్యాన్‌హోలో వేశాడు. అంతే.. మ్యాన్‌హోల్ పేలిపోయి ఫుట్‌పాత్ ధ్వంసమైంది. సమీపంలో ఉన్న వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. 

అసలు ఎందుకు పేలుతుంటాయంటే..?  

మ్యాన్‌‌హోల్‌లో విషపూరితమైన వాయువు‌లు ఉంటాయి. వాటిని పీలిస్తే మనిషి వెంటనే చనిపోతాడట. ఆ వాయువులకు మండే స్వభావం కూడా ఉంటుంది. అందుకే వాటికి నిప్పు తగిలితే పెట్రోల్ కంటే వేగంగా మండుతాయి. ఈ వీడియోలో పిల్లలు మ్యాన్‌‌హోల్‌లో బాణాసంచా వేయడం వల్ల అందులోని గ్యాస్ మండి.. ఒక్కసారిగా పేలుడు సంభవించిన ఘటనలెన్నో ఉన్నాయి.  
  •  లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.