మంగళవారం 07 జూలై 2020
National - May 28, 2020 , 14:46:00

నలుగురి కోసం ప్రత్యేక విమానం..

నలుగురి కోసం ప్రత్యేక విమానం..

మధ్యప్రదేశ్‌: భోపాల్‌లో నలుగురు కుటుంబసభ్యుల కోసం ఓ వ్యాపారవేత్త ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాడు. కరోనావ్యాప్తి నేపథ్యంలో పరిమిత స్థాయిలో విమానాలు సేవలందిస్తోన్న విషయం తెలిసిందే. తాజా పరిస్తితుల మేరకు తన కూతురు, ఇద్దరు పిల్లలు, మరో వ్యక్తిని ఢిల్లీకి సురక్షితంగా పంపించేందుకు భోపాల్‌కు చెందిన లిక్కర్‌ వ్యాపారి 180-సీటర్‌ ఏ320 ప్రైవేట్‌ విమానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

మే 25న ఢిల్లీ నుంచి సిబ్బందితో భోపాల్‌కు చేరుకున్న ప్రత్యేకవిమానం నలుగురు వ్యక్తులతో తిరిగి ఢిల్లీకి వెళ్లిందని భోపాల్స్‌ రాజభోజ్‌ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ అనిల్‌ విక్రమ్‌ తెలిపారు. అయితే సదరు వ్యాపారికి సంబంధించిన వివరాలు చెప్పడానికి అనిల్‌ విక్రమ్‌ నిరాకరించారు. ఎయిర్‌బస్‌-320 అద్దెకు తీసుకునేందుకు రూ.20 లక్షలు చెల్లించినట్లు చెప్పారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo