గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 16:13:39

మేనకోడ‌లిపై అత్యాచారం!

మేనకోడ‌లిపై అత్యాచారం!

న్యూఢిల్లీ: ‌దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణం జ‌రిగింది. సొంత మేన‌కోడ‌లిపై మామ అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. ద‌క్షిణ‌ ఢిల్లీలోని కోట్లా ఏరియాలోగ‌ల ముబార‌క్‌పూర్‌లో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున‌ ఈ దారుణం జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. కోట్లా ఏరియాలోని ప‌ల్లంజిలో నివాసం ఉండే బాలిక ఆరోగ్యం బాగాలేక‌పోవ‌డంతో గురువారం సాయంత్రం ముబార‌క్‌పూర్‌లోని అమ్మ‌మ్మ ఇంటికి వెళ్లింది. రాత్రి అక్క‌డే ప‌డుకుంది. 

దీంతో బాలిక‌పై క‌న్నేసిన మేన‌మామ శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఆమెపై అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. విష‌యం తెలుసుకున్న బాలిక త‌ల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇండియ‌న్ పీన‌ల్‌కోడ్‌లోని సెక్ష‌న్ 376 కింద‌, పోక్సో చ‌ట్టం కింద కేసులు న‌మోదుచేశారు. త‌దుప‌రి ద‌ర్యాప్తు కొన‌సాగుతుంద‌న్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo