సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 12:59:15

మైన‌ర్‌పై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్‌

మైన‌ర్‌పై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్‌

ల‌క్నో: మైన‌ర్‌పై అత్యాచారానికి పాల్ప‌డి ప‌రారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ‌త శుక్ర‌వారం  రాష్ట్రం ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ జిల్లా భోపా పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఓ యువ‌కుడు 16 ఏండ్ల బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో నిందితుడు ప‌రార‌య్యాడు. అప్ప‌టి నుంచి నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టిన పోలీసులు శుక్ర‌వారం ఉద‌యం అరెస్ట్ చేశారు. 

స‌ద‌రు నిందితుడు పొలం నుంచి ఇంటికి వెళ్తున్న త‌న‌కు లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్‌ ఎక్కించుకున్నాడ‌ని, ఆ త‌ర్వాత నిర్జ‌న ప్ర‌దేశంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌ని గ‌త శ‌నివారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు గాలింపు చేప‌ట్టి ఎట్ట‌కేల‌కు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ‌    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo