శనివారం 28 మార్చి 2020
National - Mar 10, 2020 , 12:02:04

మనిషి మాంసంతో కూర వండి..

మనిషి మాంసంతో కూర వండి..

లక్నో : తాగిన మైకంలో ఓ వ్యక్తి దెయ్యంలా ప్రవర్తించాడు. స్మశానవాటికకు వెళ్లి ఓ మృతదేహం చేయిని తీసుకువచ్చి కూర వండాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్‌ టిక్కోపూర్‌ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. సంజయ్‌(32) అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులను హింసించేవాడు. పిచ్చిగా ప్రవర్తించేవాడు. తండ్రిపై కూడా ఇటీవలే దాడి చేశాడు. అయితే సోమవారం మధ్యాహ్నం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న స్మశానవాటికకు వెళ్లాడు. అక్కడ ఓ మృతదేహం చేయిని ఇంటికి తీసుకొచ్చాడు. చేతి వేళ్లను సెపరేట్‌ చేసి.. కూర వండాడు. ఈ విషయాన్ని భార్య గమనించి తీవ్ర భయాందోళనకు గురైంది. ఇరుగుపొరుగు వారితో పాటు పోలీసులకు సమాచారం అందించింది భార్య. పోలీసులు అక్కడికి చేరుకుని సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


logo