సోమవారం 06 జూలై 2020
National - May 26, 2020 , 01:00:10

కింగ్‌ కోబ్రాకి లాలపోశాడు

కింగ్‌ కోబ్రాకి లాలపోశాడు

న్యూఢిల్లీ: పామును దగ్గరగా చూస్తేనే భయంతో ఒళ్లు జలదరిస్తుంది. భూమిపై అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటైన కింగ్‌ కోబ్రాను చూస్తే చెమటలు పట్టాల్సిందే. పది అడుగులకుపైగా ఉన్న భారీ కింగ్‌కోబ్రాకు స్నానం చేయించాలంటే ఎంత ధైర్యం ఉండాలి. కానీ, పాముల నిర్వహణలో శిక్షణ పొందిన ఓ వ్యక్తి.. భారీ కింగ్‌కోబ్రా నెత్తిమీద భయంలేకుండా బకెట్‌తో నీళ్లు పోశాడు. ఎండవేడిమిని తట్టుకోలేని పాము కూడా చక్కగా రెండు బకెట్ల నీటితో స్నానం చేసింది. 51 సెకండ్లున్న ఈ వీడియోను భారత అటవీసేవల అధికారి సుశాంత్‌నందా ఆదివారం ట్విట్టర్‌లో పోస్టుచేయగా వైరల్‌గా మారింది. ఎవరూ ఇలాంటి సాహసం చేయవద్దని నందా హెచ్చరించారు.logo