శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 13:59:54

ట్విట‌ర్‌లో ఈ ఫోటోలు షేర్ చేయ‌గానే.. మ్యారేజ్ ప్ర‌పోజ‌ల్స్ వ‌స్తున్నాయి!

ట్విట‌ర్‌లో ఈ ఫోటోలు షేర్ చేయ‌గానే.. మ్యారేజ్ ప్ర‌పోజ‌ల్స్ వ‌స్తున్నాయి!

ఎప్పుడూ చేతిలో పుస్త‌కాలు ప‌ట్టుకొని ఉంటే వారిని పుస్త‌కాల పురుగు అని అంటారు. మ‌రి ఇంటినే లైబ్ర‌రీగా మార్చేస్తే వారిని ఏమంటారు. ఏమంటారో తెలియ‌కే మ్యారేజ్ ప్ర‌పోజ్ చేస్తున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే.. ఒక వ్య‌క్తికి పుస్త‌కాలంటే పిచ్చి. ఎక్క‌డెక్క‌డ నుంచో పుస్త‌కాలు సేక‌రించి పెట్టుకుంటాడు. ఇలా అన్నింటినీ దుచుకోగా అది కాస్త లైబ్ర‌రీగా మారిపోయింది.

లైబ్ర‌రీకి సంబంధించిన కొన్ని ఫోటోల‌ను అత‌ను త‌న ట్విట‌ర్ అకౌంట్‌లో షేర్ చేశారు. 'తెలియ‌ని వారికి నేను లైబ్ర‌రీలో నివ‌సిస్తున్నాను' అనే క్యాప్ష‌న్ జోడించారు. ఈ పుస్త‌కాల ర్యాక్‌ల మ‌ధ్య‌లో ఒక కుర్చీ  కూడా ఉంది. అక్క‌డ కూర్చొని బుక్స్ చ‌దువుతూ ఉంటాడేమో. ఈ పుస్త‌కాల‌న్నింటినీ చూసిన కొంద‌రు ఈర్ష్య ప‌డుతున్నారు. మ‌రికొంద‌రైతే అత‌ని మీద ప్రేమ ఎక్కువై ప్రపోజ్ కూడా చేస్తున్నారు. logo