అంబాలా: మైనర్ కూతుర్ని అత్యాచారం చేసిన కేసులో తండ్రికి అంబాలా స్థానిక కోర్టు పదేళ్ల జైలుశిక్షను విధించింది. అడిషనల్ సెషన్స్ జడ్జి ఆర్తి సింగ్ ఇవాళ ఈ తీర్పును వెలువరించారు. కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2018లో తండ్రిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. జూలై 2018లోనే తండ్రిని సాహా పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను అంబాలా జైలులో జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. పేరెంట్స్, అక్క, తమ్ముడితో ఉంటున్నానని, ఓ రోజు నిద్ర పోతున్న సమయంలో తన తండ్రి వచ్చి లైంగికంగా దాడి చేశాడని ఆ మైనర్ అమ్మాయి తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఒకవేళ ఎవరికైనా ఈ విషయాన్ని చెబితే అప్పుడు తల్లి, సోదరుడిని మర్డర్ చేస్తానని తండ్రి బెదిరించాడు. పరిణామాలకు భయపడిన 17 ఏళ్ల ఆ అమ్మాయి జరిగిన విషయాన్ని అప్పట్లో ఎవరికీ చెప్పలేదు. అయితే తండ్రి తనపై అనేకసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఓ ఫిర్యాదులో కూతురు చెప్పింది.