శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 13:48:25

కొవిడ్ కేర్ సెంట‌ర్‌లో ఉరేసుకున్న క‌రోనా బాధితుడు

కొవిడ్ కేర్ సెంట‌ర్‌లో ఉరేసుకున్న క‌రోనా బాధితుడు

భోపాల్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఛ‌తార్‌పూర్ జిల్లాలో విషాదం నెల‌కొంది. ఓ క‌రోనా బాధితుడు(35).. కొవిడ్ కేర్ సెంట‌ర్‌లో ఉరేసుకున్నాడు. ఛ‌తార్‌పూర్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల వ్య‌క్తికి జులై 26న క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. అత‌నిలో క‌రోనా ల‌క్ష‌ణాలు లేన‌ప్ప‌టికి పాజిటివ్ రావ‌డంతో.. కొవిడ్ కేర్ సెంట‌ర్‌లో చేర్పించారు. ఆరు నెల‌ల క్రితం ఆ వ్య‌క్తి ఛాతి సంబంధిత స‌మ‌స్య‌, గొంతు నొప్పికి చికిత్స తీసుకున్నాడు. దాని వ‌ల్ల క‌రోనా రాలేద‌ని వైద్యులు చెప్పారు.

ఈ క్ర‌మంలో అత‌ను తీవ్ర మాన‌సిక ఒత్తిడికి గుర‌య్యాడు. వైద్యులు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. మొత్తానికి కొవిడ్ బాధితుడు మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి కొవిడ్ సెంట‌ర్‌లోనే ఉరేసుకున్నాడు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


logo