ఆదివారం 09 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 10:22:36

నాలుగో అంత‌స్తు నుంచి ప‌డిపోయాడు.. కానీ

నాలుగో అంత‌స్తు నుంచి ప‌డిపోయాడు.. కానీ

న్యూఢిల్లీ : ఓ వ్య‌క్తి ప్ర‌మాద‌వ‌శాత్తు నాలుగో అంత‌స్తు నుంచి కింద‌కు ప‌డిపోయాడు. కానీ అత‌ను ప్రాణాల‌తో బ‌తికాడు. ప్ర‌స్తుతం ఆ వ్య‌క్తి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. ద‌క్షిణ ఢిల్లీలోని మాల‌వీయ‌న‌గ‌ర్‌లోని అస్త అపార్ట్‌మెంట్‌లో నాలుగు అంత‌స్తులు ఉన్నాయి. జులై 29న భారీ వ‌ర్షం కురియ‌డంతో.. భ‌వ‌నంపై భాగాన నీళ్లు ఏమైనా ఉన్నాయా? అని చూసేందుకు కిష‌న్ కుమార్(40) అనే వ్య‌క్తి భ‌వ‌నంపైకి ఎక్కాడు. భ‌వ‌నం పైక‌ప్పును ప‌రిశీలిస్తుండ‌గా.. ప్ర‌మాద‌వ‌శాత్తు కింద‌కు ప‌డిపోయాడు. ఆ భ‌వ‌నం గేట్ గ్రిల్స్‌ అతనికి కుచ్చుకున్నాయి. కాళ్ల‌కు గ్రిల్స్ కుచ్చుకోవ‌డంతో త‌ల‌కిందులు అయిపోయాడు. స్థానికుల స‌మాచారంతో పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. వెల్డ‌ర్ ను పిలిపించి గ్రిల్స్‌ను తొల‌గించి.. కిష‌న్‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. లాక్‌డౌన్ కంటే ముందు కుమార్‌.. బ్యూటీ సెలూన్‌ను గురుగ్రాంలో నిర్వ‌హిస్తుండేవాడు.


logo