మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 16:23:45

గాల్లో ప‌ల్టీలు కొట్టిన సైకిల్‌.. చూస్తే గేమ్ అనుకుంటారు!

గాల్లో ప‌ల్టీలు కొట్టిన సైకిల్‌.. చూస్తే గేమ్ అనుకుంటారు!

స్టంట్స్ వేయ‌డం అంటే నేటి యువ‌త‌కు భ‌లే స‌ర‌దా. త‌ర‌చూ వాళ్లు చేసే విన్యాసాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. ఈ వీడియో చూస్తే ఆశ్చ‌ర్యం కాదు, ఒక్క‌సారిగి గుండె ఆగినంత ప‌ని అవుతుంది. గుండె ఆగేది స్టంట్ చేసిన వారికి కాదు. చూసే వాళ్ల‌కు. అలా ఉంది ఈ స్టంట్‌. 7 సెకండ్లపాటు న‌డిచే ఈ క్లిప్‌లో ఒక వ్య‌క్తి ఫ్లైఓవ‌ర్‌లో స్టంట్ సైకిల్‌ను న‌డుపుతున్న‌ట్లు  ప్రారంభ‌మ‌వుతుంది.

త‌ర్వాత అత‌ను అక‌స్మాత్తుగా రోడ్డును క్రాస్ చేసి ఒక ఎత్తైన వంతెన మీది నుంచి అవ‌త‌లి వైపుకు జంప్ చేశాడు. అత‌ను ఇంకొక ఫ్లాట్‌ఫాంపైకి చేరుకుంటాడు. త‌ర్వాత భ‌వ‌నం గోడ‌పై నుంచి కింద‌కి హీరోలాగా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ త‌ర్వాత అత‌ను ఎలా ఉన్నాడ‌ని నెటిజ‌న్లు ఖంగారుప‌డుతున్నారు. ఈ వీడియోను సీసీటీవి ఇడియ‌ట్స్ ట్విటర్‌లో షేర్ చేశారు. పోస్ట్ చేసిన కాసేప‌టికే 50 వేల మంది వీక్షించారు. 'ఈ స్టంట్‌ని ఇప్ప‌టికీ న‌మ్మ‌లేక‌పోతున్నాం'  అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. కొంత‌మంది అయితే ఈ స్టంట్‌ను గ్రాండ్ థెప్ట్ ఆటో వి (జీటీఏ వి)గేమ్‌తో పోలుస్తున్నారు. 

    

 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo