మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 01:24:27

కూర్చున్న కొమ్మనే నరికాడు! ... అదీ తాటిచెట్టుపై..

కూర్చున్న కొమ్మనే నరికాడు! ... అదీ తాటిచెట్టుపై..

కూర్చున్న కొమ్మనే నరుక్కుంటారా అని మనకు తెలుగులో సామెత ఉంది. ఈ వ్యక్తి సరిగ్గా అదే పని చేశాడు. అది కూడా మామూలు చెట్టు కాదు.. ఏకంగా పొడవాటి తాటిచెట్టుపైనే ఎక్కాడు. అతడి బరువుకు ఆ చెట్టు ఓవైపు వంగిపోయింది. అయినా భయపడకుండా ఎలక్ట్రిక్‌రంపంతో దాని శిఖరభాగాన్ని నరికాడు. ఆకులతో కూడిన ఆ భాగం తెగి ఓవైపు పడిపోయింది. దాంతో మిగిలిన తాటిచెట్లు భీకరంగా అటూ ఇటూ ఊగింది. అయినా, పట్టు సడలి పడిపోకుండా అతడు దానిపై కూర్చున్నాడు. బాహుబలి సినిమాలో సీన్‌ను తలపించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతున్నది.logo