బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 13:33:24

క‌రోనా టైంలో భ‌య‌ప‌డుతూ సెలూన్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. రోబో వ‌చ్చేసింది!

క‌రోనా టైంలో భ‌య‌ప‌డుతూ సెలూన్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. రోబో వ‌చ్చేసింది!

క‌రోనా నేప‌థ్యంలో షాపింగ్‌కు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. అలాంటిది సెలూన్‌కి వెళ్లాలంటే.. అమ్మో ఇంకేమైనా ఉందా. ఎక్క‌డ క‌రోనా వ‌స్తుందో అని ఇంట్లోనే హెయిర్ క‌ట్ చేసుకుంటున్నారు. అల‌వాటు లేని ప‌ని క‌దా.. స‌రిగా రాక‌పోయినా ఇంట్లో ఉండ‌డానికి ఏదైతేనేం అనుకుంటూ చేసుకుంటున్నారు. ఇక‌పై అలాంటి అవ‌స‌రంలేదు. బార్బ‌ర్ క‌న్నా సూప‌ర్ హెయిర్ స్టైల్ చేసే రోబోట్ వ‌చ్చేసింది.

ఓ యువ‌కుడు మ‌నుషుల‌తో ప‌నిలేకుండా న‌చ్చిన హెయిర్ స్టైల్ క‌ట్ చేసే రోబోట్‌ను త‌యారు చేశాడు.  ‘స్టఫ్ మేడ్ హేర్’ అనే యూట్యూబ్ చానెల్‌లో పోస్టు చేసిన ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న‌ది. వీడియోలో చూసిన‌ట్ల‌యితే రోబో త‌న రెండు చేతుల‌తో చ‌క‌చ‌కా హెయిర్ క‌ట్ చేసేస్తుంది. దీన్ని చూసిన కొంత‌మంది హ‌మ్మ‌య్యా.. అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. 


logo