శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 23, 2020 , 19:35:58

అబ్బాయిలతో మాట్లాడుతున్నారని...

అబ్బాయిలతో మాట్లాడుతున్నారని...

ఇండోర్‌:  మోరల్‌ పోలీసింగ్‌ పేరుతో హాస్టల్‌ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని మధ్యప్రదేశ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో పనిచేస్తున్న అమర్‌జీత్‌ సింగ్‌ (45) అనే వ్యక్తి ఇండోర్‌లోని భన్వర్‌ కువాన్‌ ప్రాంతంలో లేడీస్‌ హాస్టల్‌లోకి ప్రవేశించారు.  ఎంబీఏ చదువుతున్న  అమ్మాయి హాస్టల్‌ బయటకు వచ్చి తన స్నేహితులతో మాట్లాడుతుంది. ఇంతలో అమర్‌జీత్‌ సింగ్‌ వచ్చి అబ్బాయిలతో మాట్లాడుతుందని ఆ అమ్మాయిని తిడుతూ..ఆమెపై దాడి చేశాడు. అమర్‌జీత్‌ సింగ్‌ ప్రవర్తనతో  భయపడిపోయిన ఆ అమ్మాయి సహాయం కోసం ఫోన్‌ చేస్తుండటాన్ని వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. 

Violence and abusive conduct with young college girls inside a private hostel premises in the name of moral policing in Indore @ndtv @OfficeOfKNath @ChouhanShivraj @BJP4MP @INCMP @shailendranrb @CPism @PrasadVKathe @sunilcredible #swarabhaskar #RubikaLiyaquat #ShaheenBaghProtest pic.twitter.com/0QGsI43XYO


logo