మంగళవారం 07 జూలై 2020
National - May 30, 2020 , 15:31:03

వీధి కుక్కల‌‌కు భోజ‌నం పెట్టింద‌ని చైనా మ‌హిళ‌పై దాడి

వీధి కుక్కల‌‌కు భోజ‌నం పెట్టింద‌ని చైనా మ‌హిళ‌పై దాడి

న్యూఢిల్లీ: గ‌్రేట‌ర్ నోయిడాలోని ఒక‌ హౌసింగ్ సొసైటీలో చోటుచేసుకున్న చిన్న గొడ‌వ చినుకి చినుకి గాలివాన‌లా మారింది. ఒక‌ 60 ఏండ్ల వృద్ధుడు త‌న పెంపుడు కుక్క‌ను తీసుకుని వాకింగ్‌కు వెళ్తుండ‌గా.. అదే సొసైటీలో నివ‌సిస్తున్న చైనా జాతీయురాలైన మ‌హిళ వీధి కుక్క‌ల‌కు భోజ‌నం పెడుతూ క‌నిపించింది. ఇంత‌లో ఆ వీధి కుక్కులు వృద్ధుడు తీసుకెళ్తున్న పెంపుడు కుక్క‌పై దాడి చేశాయి. 

దీంతో ఆగ్ర‌హానికి లోనైన వృద్ధుడు చైనా మహిళ‌తో గొడ‌వకు దిగాడు. ఇద్ద‌రి మ‌ధ్య మాటామాటా పెరుగ‌డంతో గొడ‌వ పెద్ద‌ద‌య్యింది. దీంతో వృద్ధుడులో త‌న చేతిలో ఉన్న క‌ర్ర‌తో మ‌హిళ‌ను కొట్టాడు. చైనా మ‌హిళ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న నోయిడా పోలీసులు వృద్దుడిని అదుపులోకి తీసుకున్నారు. మే 25న గొడ‌వ జ‌రిగింద‌ని మ‌హిళ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని శుక్ర‌వారం వృద్ధుడిని అరెస్ట్ చేశామ‌ని పోలీసులు తెలిపారు.      


logo