సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 12, 2020 , 15:19:05

ఢిల్లీ విమానాశ్రయంలో వ్యక్తి అరెస్ట్‌..

ఢిల్లీ విమానాశ్రయంలో వ్యక్తి అరెస్ట్‌..

న్యూఢిల్లీ: ఢిల్లీలో గల ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్‌ వెళ్తున్న ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది అరెస్ట్‌ చేశారు. వివరాలు చూసినైట్లెతే.. మూరాద్‌ ఆలం అనే వ్యక్తి దుబాయ్‌ వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఎప్పటిలాగే భద్రతా సిబ్బంది తమ విధుల్లో భాగంగా.. ప్రయాణీకులను, వారి లగేజీలను తనిఖీ చేస్తుండగా.. మూరాద్‌ ఆలం అనే వ్యక్తి దగ్గర అనుమానాస్పద సామాగ్రి లభించింది. తీరా అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించగా.. అతని లగేజీలో వేరుశనగలు, బిస్కెట్లు, పలు తినుబండారాలు ప్యాకింగ్‌ చేసి ఉన్నాయి. అధికారులు వాటిని విప్పి చూడగా.. అందులో వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు ఉన్నాయి. యూరో, సౌదీ, ఖతర్‌, కువైట్‌, ఒమన్‌ దేశాల కరెన్సీ ఉంది. దీంతో అధికారులు సదరు కరెన్సీని స్వాధీనం చేసుకొని, అతడిని విచారిస్తున్నారు.  ఆ క‌రెన్సీ విలువ సుమారు 45 ల‌క్ష‌లు ఉన్న‌ట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు చెప్పారు.logo