శనివారం 06 జూన్ 2020
National - May 20, 2020 , 20:50:36

రైల్వే నకిలీ టోకెన్లు అమ్ముతున్నవ్యక్తి అరెస్ట్‌

రైల్వే నకిలీ టోకెన్లు అమ్ముతున్నవ్యక్తి అరెస్ట్‌

భోపాల్‌: కరోనా వైరస్ కారణంగా ప్రజారవాణా నిలిచిపోయి ప్రజలంతా ఇబ్బంది పడుతుండగా.. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకోని మోసానికి పాల్పడ్డాడో వ్యక్తి. ఎక్కువ మందిని మోసం చేయకముందే అదుపులోకి  తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హబీబ్‌గంజ్‌లో జరిగింది. నిందితుడు రాజేశ్‌ రాయ్‌.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న కుట్రతో రైలు ప్రయాణికులను మోసం చేయాలని ప్రయత్నించాడు. రైలు టిక్కెట్లు దొరుకడం  కష్టమవుతుండటంతో వారి అవసరాలను ఆసరాగా చేసుకొని పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేసి రైల్వే టోకెన్లు అమ్మడం మొదలెట్టాడు. రైల్వే అధికారిగా అవతారం  ఎత్తేందుకు పీపీఈ కిట్‌ను ధరించి ధనవంతులైన ప్రయాణికులకు గాలం  వేయడం మొదలెట్టాడు. బీహార్‌కు చెందిన ఒక ఇంజినీరింగ్‌ విద్యార్థి ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడు రాజేశ్‌ రాయ్‌ను హబీబ్‌గంజ్‌ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి  తీసుకొన్నట్టు ఎస్పీ భూపేంద్రసింగ్‌ తెలిపారు. అప్పటికే బయల్దేరిన రైళ్లకు సంబంధించి కూడా టోకెన్లు అమ్మినట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఆయన వెల్లడించారు.


logo