గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 15, 2020 , 16:55:00

ఆయుధంతో ఫొటో..వ్యక్తి అరెస్ట్‌

ఆయుధంతో ఫొటో..వ్యక్తి అరెస్ట్‌

న్యూఢిల్లీ: అక్రమాయుధాలతో ఫొటో దిగి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హోలీ సందర్భంగా అంబేద్కర్‌ నగర్‌లో వినీత్‌ అనే వ్యక్తి తన చేతిలో ఓ పిస్తోల్‌ పట్టుకుని మరో ముగ్గురితో కలిసి ఫొటో దిగి..వాట్సాప్‌ స్టేటస్‌లో పోస్ట్‌చేశాడు. తర్వాత వినీత్‌ ఆ  ఫొటోను డిలీట్‌ చేశాడు. ఈ విషయాన్ని పోలీస్‌ ఇన్‌ఫార్మర్లు తమకు తెలియజేయడంతో వినీత్‌ను అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ అతుల్‌ కుమార్‌ ఠాకూర్‌ తెలిపారు. వినీత్‌ దగ్గర నుంచి దేశీయ పిస్తోల్‌తోపాటు రెండు మందుగుండ్లను స్వాధీనం చేసుకున్నాం. అంబేద్కర్‌ నగర్‌ పీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. 


logo
>>>>>>