గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 16:27:42

బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో వ్య‌క్తి అరెస్టు

బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో వ్య‌క్తి అరెస్టు

ల‌క్నో : మైన‌ర్ కిడ్నాప్‌, అత్యాచారం కేసులో ముగ్గురు నిందితుల్లో పోలీసులు ఓ వ్య‌క్తిని అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లోని పోపా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో గురువారం నాడు చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఇంట్లోని చెంత‌ను బాలిక గ్రామంలోని డంప్‌యార్డ్‌లో ప‌డేసేందుకు వెళ్ల‌గా నిందితుడు బాలిక‌ను కిడ్నాప్ చేసి ప్ర‌క్క‌నే ఉన్న చెరుకు తోట‌లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఈ త‌తంగానంతా మ‌రో వ్య‌క్తి వీడియో తీశాడు. నిందితుడు గౌర‌వ్‌ను శుక్ర‌వారం నాడు అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు. ప‌రారీలో ఉన్న మ‌రో ఇద్ద‌రి వ్య‌క్త‌ల ఆచూకీకి గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు.


logo