ఆదివారం 05 జూలై 2020
National - Jun 19, 2020 , 09:03:20

రోడ్ల‌పై తిరుగొద్ద‌న్నందుకు పోలీసుల‌పైనే దాడి

రోడ్ల‌పై తిరుగొద్ద‌న్నందుకు పోలీసుల‌పైనే దాడి

  • మ‌హిళ స‌హా ఇద్ద‌రు నిందితుల అరెస్ట్‌

న్యూఢిల్లీ: రోడ్ల‌పై తిరుగొద్దు ఇండ్ల‌కు వెళ్లండి అని హెచ్చ‌రించినందుకు ఓ మ‌హిళ‌, మ‌రో వ్య‌క్తి క‌లిసి పోలీసుల‌పైనే దాడికి పాల్ప‌డ్డారు. హ‌ర్యానా రాష్ట్రం ఫ‌తేహాబాద్ జిల్లా భున పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో గురువారం తెల్ల‌వారుజామున మూడు గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. తెల్ల‌వారుజామున మూడు గంట‌ల‌కు ఓ మ‌హిళ‌, మ‌రో వ్య‌క్తి క‌లిసి రోడ్డుపై క‌నిపించార‌ని, ఈ టైమ్‌లో ఇక్క‌డ ఏం చేస్తున్నారంటూ వారిని ప్ర‌శ్నించామ‌ని, ఇంటికి వెళ్లిపొమ్మ‌ని హెచ్చ‌రించామ‌ని, అయితే వాళ్లు త‌మ హెచ్చ‌రిక‌ల‌ను లెక్క‌చేయ‌కుండా త‌మ‌పైనే దాడికి పాల్ప‌డ్డార‌ని భున పోలీసులు తెలిపారు. దాంతో నిందితులు ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నామ‌ని చెప్పారు. 

త‌మ సిబ్బందిపై దాడికి పాల్ప‌డినందుకే నిందుతులు ఇద్ద‌రిని అరెస్టు చేశామ‌ని భున పోలీస్‌స్టేష‌న్ స‌ర్కిల్‌ ఇన్‌స్పెక్ట‌ర్ క‌శ్మీర్ సింగ్ తెలిపారు. నిందితులు త‌మ సిబ్బందిపై దాడి చేశార‌ని, పోలీస్ యూనిఫామ్ చింపేశార‌ని ఆయ‌న చెప్పారు.      


logo