శనివారం 11 జూలై 2020
National - Jun 17, 2020 , 18:06:56

ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్: మ‌మ‌త డుమ్మా

ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్: మ‌మ‌త డుమ్మా

కోల్‌క‌తా: దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై చ‌ర్చించ‌డం కోసం బుధ‌వారం ప్రధాని న‌రేంద్ర మోదీ నిర్వహించిన ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌కు ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మమతా బెనర్జి డుమ్మా కొట్టారు. ఆమె తరపున ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన సీనియర్ అధికారి వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్నారు. ప్ర‌ధానితో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొనేందుకు సీఎం మ‌మ‌తాబెన‌ర్జికి స‌మ‌యంలేద‌ని, అదే స‌మ‌యంలో కొవిడ్‌పై అత్యున్న‌త స్థాయి స‌మావేశానికి ఇప్ప‌టికే షెడ్యూల్ ఖ‌రారైంద‌ని బెంగాల్ ప్ర‌భుత్వం అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది.   

కాగా, దేశంలో క‌రోనా ప‌రిస్థితి‌పై చ‌ర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, కేంద్ర‌పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌ల‌తో మంగ‌ళ‌, బుధ‌వారాల్లో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు మంగళవారం పంజాబ్, అసోం, కేరళతోపాటు కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, యూపీ, బెంగాల్‌తోపాటు మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్‌ నిర్వహించారు. 


logo