గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 21:42:55

‘వచ్చే ఏడాది సీఎంగా మమత ప్రమాణ స్వీకారం చేయలేరు’

‘వచ్చే ఏడాది సీఎంగా మమత ప్రమాణ స్వీకారం చేయలేరు’

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో తృణముల్‌ కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌ తిప్పికొట్టారు. వచ్చే ఏడాది ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశమే లేదని అన్నారు. మంగళవారం కోల్‌కతాలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మమత బీజేపీ అంటే బయపడుతున్నారని అందుకే తమ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. తృణముల్‌ కాంగ్రెస్‌లో ఎవ్వరూ చేరేందుకు సిద్ధంగా లేకపోవడంతో వివిధ పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకుంటున్నారని ఆరోపించారు.

2021లో రాష్ట్రంలో టీఎంసీ తుడుచుపెట్టుకుపోతుందని చెప్పారు. మంగళవారం ఉదయం కోల్‌కత్తాలో జరిగిన ఓ ర్యాలీలో మమత బెనర్జీ ప్రసంగిస్తూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుందని, రాష్ట్రం నుంచి బీజేపీని బయటకు గెంటేస్తామని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి, దేశానికి కొత్త దిశను చూపిస్తాయని పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లోని 42పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ 18 స్థానాలు కైవసం చేసుకొని అధికార టీఎంసీకి జలక్‌ ఇచ్చింది.


logo