గురువారం 21 జనవరి 2021
National - Jan 14, 2021 , 21:35:39

41 మంది తృణమూల్‌ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు రెడీ!

41 మంది తృణమూల్‌ ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు రెడీ!

కోల్‌క‌తా: వ‌చ్చే ఏప్రిల్‌-మే నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న‌నేప‌థ్యంలో ప‌శ్చిమ బెంగాల్‌లో అధికార త్రుణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి, బీజేపీకి మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదురుతున్న‌ది. ప్ర‌స్తుతం త‌న‌తో 41 మంది త్రుణ‌మూల్ ఎమ్మెల్యేలు త‌న‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని బీజేపీ సీనియ‌ర్ నేత కైలాష్ విజ‌య్ వ‌ర్గియ గురువారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

వారంతా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని కైలాష్ విజ‌య్ వ‌ర్గియ చెప్పారు. తాము అంగీక‌రిస్తే ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌ని, కానీ స‌చ్చీలుర‌ను మాత్ర‌మే పార్టీలోకి ఆహ్వానిస్తామ‌న్నారు. మ‌మ‌తాబెన‌ర్జీ ప్ర‌భుత్వం కూలిపోవ‌డం ఖాయం అని జోస్యం చెప్పారు. 

ఏడుగురు బీజేపీ ఎంపీల్లో ఆరుగురు త్రుణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ప‌శ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మ‌ల్లిక్ ప్ర‌క‌టించిన కొన్ని రోజుల‌కు కైలాష్ విజ‌య్ వ‌ర్గీయ పై వ్యాఖ్య‌లు చేశారు. ఇంత‌కుముందు బీజేపీలో చేరిన టీఎంసీ నేత‌లు తిరిగి వెనుక‌కు వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ప‌శ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మ‌ల్లిక్ అన్నారు. దీనిపై తుది నిర్ణ‌యం సీఎం మ‌మ‌తాబెన‌ర్జీదేన‌ని చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo