శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 03, 2020 , 14:36:18

కేంద్రానికి వార్నింగ్ ఇచ్చిన మ‌మ‌తా బెన‌ర్జీ..

కేంద్రానికి వార్నింగ్ ఇచ్చిన మ‌మ‌తా బెన‌ర్జీ..

హైదరాబాద్‌: రైతుల‌కు వ్య‌తిరేకంగా ఉన్న కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను కేంద్రం వెనక్కి తీసుకోంటే దేశ‌వ్యాప్త ఉద్య‌మం చేప‌డుతామ‌ని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ వార్నింగ్ ఇచ్చారు.  రైతులు, వారి జీవితాల గురించి నేనెంతో ఆందోళ‌న చెందుతున్నాన‌ని, రైతుల‌కు వ్య‌తిరేకంగా ఉన్న బిల్లుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకెఓవాల‌ని, లేనిప‌క్షంలో తాము రాష్ట్ర‌, దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు మ‌మ‌తా తెలిపారు. ముందు నుంచే తాము కొత్త వ్య‌వ‌సాయ బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆమె త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.   

రైతు నిర‌స‌న‌ల‌పై చ‌ర్చించేందుకు శుక్ర‌వారం తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌త్యేకంగా భేటీకానున్న‌ట్లు ఆమె తెలిపారు.  నిత్యావ‌స‌ర వ‌స్తువుల చ‌ట్టం ఎలా సాధార‌ణ ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావం చూపుతుందో, దాని వ‌ల్ల ఎలా నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయో, వాటి గురించి చర్చించ‌నున్న‌ట్లు దీదీ చెప్పారు.  రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం త‌ప్ప‌కుండా వెన‌క్కి తీసుకోవాల‌న్నారు.  కేంద్ర ప్ర‌భుత్వం అన్ని సంస్థ‌ల‌ను అమ్మేస్తున్న‌ద‌ని, రైల్వేలు, ఎయిర్ ఇండియా, బొగ్గు గ‌నులు, బీఎస్ఎన్ఎల్‌, బీహెచ్ఈఎల్‌, బ్యాంకులు, ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను అమ్మేయ‌డం స‌రికాదు అని ఆమె అన్నారు.  లోప‌భూయిష్ట‌మైన  ఎఫ్‌డీఐ, ప్రైవేటీక‌ర‌ణ విధానాల‌ను కేంద్రం ఉప‌సంహ‌రించాల‌న్నారు. దేశ సంప‌ద అయిన ఈ సంస్ధ‌ల‌ను.. బీజేపీ వ్య‌క్తిగ‌త సొత్తుగా మార్చుకో‌కుండా అడ్డుకోవాల‌న్నారు.  


logo