e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News తొలి విడతలో బీజేపీకి మొండిచేయే : మమతా బెనర్జీ

తొలి విడతలో బీజేపీకి మొండిచేయే : మమతా బెనర్జీ

తొలి విడతలో బీజేపీకి మొండిచేయే : మమతా బెనర్జీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో 30 అసెంబ్లీ స్ధానాలకు గాను 26 స్ధానాలు కాషాయ పార్టీకి వస్తాయని ఆ పార్టీ చీఫ్‌ అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. తొలి దశ ఎన్నికల్లో బీజేపీకి సున్నా స్ధానాలు దక్కుతాయని అన్నారు.చందీపూర్‌లో జరిగిన ప్రచార ర్యాలీని ఉద్దేశించి దీదీ మాట్లాడుతూ బీజేపీకి పెద్ద రసగుల్లా(జీరో) వస్తుందని వ్యాఖ్యానించారు.

బెంగాల్‌ ఎన్నికలు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యయుతంగా జరిగేలా వ్యవహరించాలని కేంద్ర బలగాలను ఆమె కోరారు. రాబోయే పలు దశల పోలింగ్‌ పట్ల తటస్ధంగా వ్యవహరిస్తూ ఓటర్లను మభ్యపెట్టేలా వ్యవహరించవద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు అమిత్‌ షాను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ బ్లఫ్‌మాస్టర్‌గా అభివర్ణించారు. బెంగాల్‌లో మైండ్‌గేమ్స్‌ పనిచేయవని, గుజరాత్‌లో ఈ జోస్యాలు చెప్పుకోవాలని అమిత్‌ షాకు తృణమూల్‌ఎంపీ డెరెక్‌ ఓబ్రెన్‌ సూచించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తొలి విడతలో బీజేపీకి మొండిచేయే : మమతా బెనర్జీ

ట్రెండింగ్‌

Advertisement