బెంగాల్‌ను గుజరాత్ కానివ్వం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ను గుజరాత్ కానివ్వబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బెంగాల్లో గుజరాత్ తరహా అభివృద్ధి నమూనాను అమలు చేస్తామన్న బీజేపీ నేతల ప్రకటనలపై ఆమె మండిపడ్డారు. దేశానికి జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని, జైహింద్ నినాదాన్ని ఇచ్చింది బెంగాలేనని అన్నారు. మరోవైపు, ఇటీవల తమ పార్టీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారిపై తృణమూల్ నాయకులు విమర్శలు ఎక్కుపెట్టారు. బెంగాల్ రాజకీయాల్లో ద్రోహులకు చోటులేదన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇంటి ముంగిటికే ప్రభుత్వం’ (ద్వారే సర్కార్) కార్యక్రమం విజయవంతం కావడం బీజేపీ నాయకులకు కడుపుమంటగా ఉందని రాష్ట్ర మంత్రి పార్థ చటర్జీ విమర్శించారు. తృణమూల్ మాటల దాడిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. కరోనా వైరస్ కంటే తృణమూల్ చాలా ప్రమాదకరమైనదని బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శించారు. మరోవైపు, బెంగాల్‌లోని రామ్‌నగర్‌లో తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య బుధవారం జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు.
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
- తాండవ్ నటీనటులపై కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు
- కాంగ్రెస్ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్‌కు.. లేదంటే గెహ్లాట్‌కు!
- తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు
- టీమిండియాకు ఘన స్వాగతం
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి.. కంగనా విషెస్
- నేడు ఐసెట్ మూడో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
- కుటుంబ కలహాలతో.. భార్య, కుమార్తెను చంపిన భర్త
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్