బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 25, 2020 , 19:36:54

ఢిల్లీ అల్లర్లపై స్పందించిన మమతా బెనర్జీ..

ఢిల్లీ అల్లర్లపై స్పందించిన మమతా బెనర్జీ..

కలకత్తా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఢిల్లీలో కొనసాగుతున్న అల్లర్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. షాహీన్‌బాగ్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు తమను కలత చెందిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోందని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు మేము చూస్తూనే ఉన్నాం. ఎన్నాళ్లిలా..! అసలు మనదేశంలో హింసకు చోటులేదు. మేము దేశ ప్రజల తరఫున శాంతిని కోరుకుంటున్నామని తెలిపిన వెస్ట్‌ బెంగాల్‌ సీఎం.. ప్రతి ఒక్కరూ.. శాంతిని కలిగి ఉండాలని విన్నవించారు.


logo
>>>>>>