శనివారం 28 మార్చి 2020
National - Mar 19, 2020 , 02:10:22

ఐఏఎస్‌ కుమారుడి అరాచకం

ఐఏఎస్‌ కుమారుడి అరాచకం

  • మండిపడ్డ సీఎం మమత 

కోల్‌కతా: బ్రిటన్‌ నుంచి వచ్చిన ఒక మహిళా ఐఏఎస్‌ అధికారి కుమారుడి బాధ్యతారాహిత్యంపై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం ప్రదర్శించారు. ఆ యువకుడికి కరోనా నిర్ధారణ అయింది. బెంగాల్‌లో ఇదే తొలి కేసు. అయితే కరోనా పరీక్షలకు ముందు అతడు చాలా మంది స్నేహితులు, బంధువులను కలిశాడని వార్తలు వచ్చాయి. దీనిపై మమత స్పందిస్తూ.. ‘వైరస్‌తో విదేశాల నుంచి వచ్చి ఇలా యధేచ్చగా తిరుగుతామంటే ఊరుకొనేది లేదు. తప్పనిసరిగా గృహనిర్బంధంలో ఉండాల్సిందే’ అని పేర్కొన్నారు. సచివాలయంలో సీఎం కార్యాలయం ఉన్న భవనంలోనే సదరు ఐఏఎస్‌ అధికారిణి కార్యాలయం ఉండటం, ఆమె కుమారుడికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలడంతో ప్రభుత్వ పెద్దలు భయపడిపోయారు. కరోనా  పరీక్షలు చేయించుకొని.. తమకు వైరస్‌ సోకలేదని తేలడంతో ఊపిరి పీల్చుకొన్నారు. 


logo