బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 12:26:25

సూర్యప్రభ వాహ‌నంపై కేశ‌వ‌మూర్తి అలంకారంలో మ‌ల‌య‌ప్ప స్వామి

సూర్యప్రభ వాహ‌నంపై కేశ‌వ‌మూర్తి అలంకారంలో మ‌ల‌య‌ప్ప స్వామి

తిరుపతి : శ్రీవారి సాల‌క‌ట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో మలయప్పస్వామి వారు శంఖు, చక్రం, గ‌థ‌‌, అభ‌య‌హ‌స్తం ధ‌రించి చ‌తుర్భు‌జ కేశ‌వ‌మూర్తి అలంకారంలో దర్శనమిచ్చారు. ఏడో రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. 

రాత్రి 7 గంటలకు చంద్రప్రభ ‌వాహనంపై మ‌ల‌య‌ప్ప స్వామివారు అనుగ్రహిస్తారు. వాహ‌న‌సేవ‌లో పెద జీయ‌ర్ స్వామి, చిన్నజీయ‌ర్ స్వామి, టీటీడీ ధర్మకర్తల మండ‌లి అధ్యక్షుడు వైవీ.సుబ్బారెడ్డి, ఈవో  అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ధ‌ర్మకర్తల మండ‌లి స‌భ్యులు వేమిరెడ్డి ప్రశాంతి, డా.నిశ్చిత‌, శివ‌కుమార్‌, శేఖ‌ర్ రెడ్డి, గోవింద‌హ‌రి, డీపీ అనంత‌, ఆలయ డిప్యూటీ ఈఈ హరీంద్రనాథ్ పాల్గొన్నారు.logo