మంగళవారం 14 జూలై 2020
National - Jun 22, 2020 , 22:26:13

ఐదుగురిని చంపిన ఆ పులి చ‌చ్చిపోయింది

ఐదుగురిని చంపిన ఆ పులి చ‌చ్చిపోయింది

నాగ్‌పూర్‌: ఐదు నెల‌ల కాలంలో ఐదుగురిని చంపిన పెద్ద‌పులి కేటీ-1 చ‌చ్చిపోయింది. మ‌హ‌రాష్ట్ర‌లోని నాగ్‌పూర్ జిల్లాలోగ‌ల గోరెవాడ జూ, జంతు సంర‌క్ష‌ణ కేంద్రంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. రక్తాన్ని విష‌పూరితంగా మార్చే సెప్టికేమియా అనే ఒక ర‌కం వ్యాధి కార‌ణంగా పెద్ద‌పులి మ‌ర‌ణించింద‌ని అట‌వీశాఖ‌కు సంబంధించిన వైద్యులు ప్రాథ‌మిక అంచ‌నాకు వ‌చ్చారు. పోస్ట్‌మార్టం నివేదిక‌లో పులి మృతికిగ‌ల కార‌ణాలు క‌చ్చితంగా తెలిసే అవ‌కాశం ఉంద‌న్నారు. 

అటవీ అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మృతిచెందిన పెద్ద‌పులి గ‌త ఐదు నెల‌ల కాలంలో ఐదుగురిని చంపేసింది. త‌డోబా అంధేరి రిజ‌ర్వ్ ఫారెస్ట్ స‌మీపంలోని కొలారా, బామ‌న్‌గావ్‌, స‌తారా గ్రామాల‌కు చెందిన ఐదుగురు ఆ పులి బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయారు. దీంతో బాధిత గ్రామాల‌ ఫిర్యాదు మేర‌కు పులికి మ‌త్తుమందు ఇచ్చి గోరెవాడ జంతుసంర‌క్ష‌ణ కేంద్రానికి త‌ర‌లించారు. అప్ప‌టి నుంచి అనారోగ్యంగానే ఉన్న పులి ఈ ఉద‌యం మృతిచెందింది. 


logo