శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 10:21:49

పాలిస్తున్న మగ మేక‌

పాలిస్తున్న మగ మేక‌

జైపూర్ : మ‌గ మేక పాలు ఇవ్వ‌డ‌మేంట‌ని ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దా! అవును ఆ మేక పాలిస్తుంది. హ‌ర్మోన్ల అస‌మ‌తుల్య‌త కార‌ణంగా మేక పాలు ఇస్తుంద‌ని ప‌శు సంవ‌ర్ధ‌క శాఖ వైద్యులు చెబుతున్నారు. 

రాజ‌స్థాన్ ధోల్పూరులోని గుర్జా గ్రామానికి చెందిన రాజీవ్ కుష్వాహా.. రెండున్న‌ర నెల‌ల వ‌య‌సున్న ఓ మేక‌ను కొనుగోలు చేశాడు. ఆరు నెల‌ల త‌ర్వాత ఆ మేక పొదుగును అభివృద్ధి చేసింది. ఆ స‌మ‌యంలో పొదుగును పిత‌క‌గా.. పాలు ఉత్ప‌త్తి అయ్యాయి. ప్ర‌తి రోజు 200 నుంచి 250 గ్రాముల పాల‌ను ఇస్తున్న‌ట్లు య‌జ‌మాని తెలిపాడు. 

ఓ మ‌గ మేక పాలివ్వ‌డం ఇదే మొద‌టిసారి అని స్థానికులు తెలిపారు. ఆ మేక పాలివ్వ‌డాన్ని తాము గ‌మ‌నించాన‌మి స్ప‌ష్టం చేశారు. 

ఈ సంద‌ర్భంగా వెట‌ర్న‌రీ స‌ర్జ‌న్ సక్సేనా మాట్లాడుతూ.. మేక గ‌ర్భం దాల్చిన స‌మ‌యంలో.. హ‌ర్మోన్ల అస‌మ‌తుల్య‌త కార‌ణంగా ఆడ జ‌న‌నేంద్రియాలు, ద్వితీయ లైంగిక ల‌క్ష‌ణాలు అభివృద్ధి అవుతాయ‌ని చెప్పారు. ఈ ప‌రిస్థితి చాలా అరుదు. ఇలాంటి కేసులు మిలియ‌న్ కేసుల్లో ఒక‌టి జ‌రుగుతుంద‌ని స‌క్సేనా చెప్పారు.  


logo