గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 22, 2020 , 11:03:06

సైబర్‌క్రైమ్‌, ఉగ్రవాదమే ప్రధాన సమస్యలు : జస్టిస్‌ ఎన్వీ రమణ

సైబర్‌క్రైమ్‌, ఉగ్రవాదమే ప్రధాన సమస్యలు : జస్టిస్‌ ఎన్వీ రమణ

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సదస్సులో సీజేఐ జస్టిస్‌ బోబ్డే, జస్టిస్‌ ఎన్వీ రమణ, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో పాటు 24 దేశాల నుంచి న్యాయనిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ప్రపంచంలో అనేక సమస్యలున్నాయన్నారు. ఉగ్రవాదం, సైబర్‌ క్రైమ్‌ ప్రధాన సమస్యలు అని ఆయన స్పష్టం చేశారు. కొత్త ఆలోచనలతో న్యాయ వ్యవస్థ ముందుకు రావాలని రమణ సూచించారు. వివిధ దేశాల న్యాయనిపుణులను ఈ సదస్సు ఒకే వేదికపైకి తెచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు పంచుకోవాలి.. సమస్యల పరిష్కారానికి అందరం కలిసి పని చేయాలి. తమది వసుధైక కుటుంబం అని ఆయన పేర్కొన్నారు. మహిళలు అనేక రంగాల్లో ముందున్నారని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. 


logo