శుక్రవారం 03 జూలై 2020
National - May 24, 2020 , 15:53:57

దేశీయ విమానాలకు అనుమతించని మూడు రాష్ర్టాలు!

దేశీయ విమానాలకు అనుమతించని మూడు రాష్ర్టాలు!

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ విధించిన రెండు నెలల తర్వాత దేశంలో విమానాల రాకపోకలకు అంతా సిద్ధమైంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు రేపటి నుంచి విమానాలు చక్కర్లు కొట్టనున్నాయి. అయితే మూడు రాష్ర్టాలు మాత్రం ఇంకా తాము సిద్ధంగా లేమని, ఇప్పట్లో విమానాలు నడపడానికి విళ్లేదని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెబుతున్నాయి. ఆ మూడు.. దేశంలోని అతిపెద్ద రాష్ర్టాలు కావడంతోపాటు, అత్యంత ప్రాముఖ్యత కలిగినవేకాకుండా, అక్కడి విమానాశ్రయాలు దేశంలోనే అత్యంత రద్దీగా ఉండేవే కావడం విశేషం. అవే దక్షిణాన ఉన్న తమిళనాడు, తూర్పున ఉన్న మహారాష్ట్ర, పశ్చిమాన ఉన్న పశ్చిమబెంగాల్‌. ఇందులో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండగా, పశ్చిమబెగాల్‌ కరోనా కేసులతోపాటు, అంఫాన్‌ తుఫానుతో అతలాకుతలమయ్యింది. 

ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఇప్పట్లో విమానాలు నడపడానికి తాము సిద్ధం లేమని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో కరోనాకు కేంద్రబిందువుగా చెన్నై మారడంతో, కరోనా వ్యాప్తిని నిలువరించడానికి ఈ నెల 31 వరకు విమాన సర్వీసులను చెన్నైకి నడపకూడదని తమిళనాడు ప్రభుత్వం, అంఫాను తుఫాను సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నామాని, ఇప్పట్లో కోల్‌కతాకు విమానాలు వద్దని పశ్చిమబెంగాల్‌ సర్కార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.


logo