గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 02, 2020 , 02:30:06

లెఫ్టినెంట్‌ జనరల్‌గా మాధురి

లెఫ్టినెంట్‌ జనరల్‌గా మాధురి

న్యూఢిల్లీ: సైనికాధికారి డాక్టర్‌ మాధురి కనిత్కర్‌ శనివారం లెఫ్టినెంట్‌ జనరల్‌గా  పదోన్నతి పొందారు. తద్వారా భారత సైన్యంలో ఈ ఘనత సాధించిన మూడో మహిళగా, తొలి మహిళా శిశువైద్యురాలిగా రికార్డు సాధించారు. ఆమె త్రివిధ దళాల అధిపతి (సీడీఎస్‌) ప్రధాన కార్యాలయంలో పనిచేయనున్నారు. రక్షణ దళాలకు కేటాయించిన బడ్జెట్‌ నిధుల సద్వినియోగం, ఆయుధాల సమీకరణ, దళాలకు శిక్షణ, చేపట్టే ఆపరేషన్ల సంయుక్త ప్రణాళిక, అనుసంధానంలో ఆమె కీలకపాత్ర వహించనున్నారు. ఫుణెలోని రక్షణ దళ వైద్య కళాశాల అధిపతిగా పనిచేసిన డాక్టర్‌ కనిత్కర్‌కు సైన్యంలో 37 ఏండ్లు పనిచేసిన అనుభవం ఉన్నది. ఆమె భర్త రాజీవ్‌ కూడా లెఫ్టినెంట్‌ జనరల్‌గా సైన్యంలో సేవలు అందిస్తున్నారు. 
logo
>>>>>>