సోమవారం 06 జూలై 2020
National - Jun 18, 2020 , 11:03:14

గల్వాన్‌ పరిస్థితులపై ఉన్నతస్థాయి సమావేశం

గల్వాన్‌ పరిస్థితులపై ఉన్నతస్థాయి సమావేశం

న్యూఢిల్లీ: గల్వాన్‌లో ఉద్రిక్త పరిస్థితులపై భారత్‌, చైనా ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభయ్యాయి. ఈ నెల 15, 16 తేదీల్లో గల్వాన్‌ లోయలో జరిగిన హింసాత్మక ఘటనలపై మేజర్‌ జనరల్‌ స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు సైనికవర్గాలు ప్రకటించాయి. ఇదే అంశంపై నిన్న కూడా ఇరుదేశాల సైనిక ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో సమావేశం అసంపూర్తిగా ముగిసిందని సమాచారం. 

గల్వాన్‌లో భారత సైనికులపై చైనా సైనికులు ముందస్తు పథకం ప్రకారమే దాడిచేశారని విదేశాంగమంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. చైనా సైన్యం ఇలాంటి చర్యలు మానుకోకపోతే దైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. చైనా తన తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. బుధవారం ఆయన చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఈతో ఫోన్‌లో మాట్లాడారు.

లఢక్‌లోని గల్వాన్‌ లోయలో సోమవారం సాయంత్రం చైనా సైనికులు భారత సైన్యంపై రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. దీంతో ఇరుదేశా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. 


logo