ఆదివారం 29 మార్చి 2020
National - Mar 19, 2020 , 10:29:08

పేలిన గ్యాస్‌ సిలిండర్‌ : 15 గుడిసెలు దగ్ధం

పేలిన గ్యాస్‌ సిలిండర్‌ : 15 గుడిసెలు దగ్ధం

ముంబయి : పుణెలోని వాడర్‌వాడి ఏరియాలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ గుడిసెలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో ఆ గుడిసెతో పాటు సమీప గుడిసెలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 15 గుడిసెలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది.. ప్రమాదస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రాణ నష్టం జరగలేదు. 15 కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. 

పుణె సిటీకి సమీపంలోని ఆటో మొబైల్‌ కంపెనీలో ఫిబ్రవరి 18న అగ్నిప్రమాదం సంభవించింది. 2019, నవంబర్‌లో పుణెలోని శివాజీనగర్‌లోని స్లమ్‌ ఏరియాలో కూడా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. logo