శనివారం 16 జనవరి 2021
National - Jan 02, 2021 , 12:57:19

హార్లే డేవిడ్‌స‌న్ షోరూమ్‌లో అగ్నిప్ర‌మాదం..

హార్లే డేవిడ్‌స‌న్ షోరూమ్‌లో అగ్నిప్ర‌మాదం..

న్యూఢిల్లీ: న‌గ‌రంలోని మోతీన‌గ‌ర్‌లో ఉన్న హార్లే డేవిడ్‌స‌న్ షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది.  బిల్డింగ్‌లోని మొద‌టి, రెండ‌వ ఫ్లోర్ల‌లో మంట‌లు వ్యాపించాయి.  తెల్ల‌వారుజామున ఒంటి గంట‌ల‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  సుమారు 25 అగ్నిమాప‌క ఇంజిన్లు ప్ర‌మాద ప్రాంతానికి చేరుకున్నాయి.  అయితే బిల్డింగ్ మూడ‌వ అంత‌స్తులో ఉన్న నైట్‌క్ల‌బ్ నుంచి న‌లుగురు వ్య‌క్తుల్ని ర‌క్షించారు. ఉద‌యం 6 గంట‌ల‌కు మంట‌లు అదుపులోకి వ‌చ్చాయి.  అగ్నిప్ర‌మాదం వల్ల ఫ‌స్ట్‌, సెకండ్ ఫ్లోర్లు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు బేస్మెంట్ కూడా డ్యామేజ్ అయిన‌ట్లు తెలిపారు.  బిల్డిండ్ టెర్ర‌స్‌పై నైట్‌క్లబ్‌తో పాటు రెస్టారెంట్ కూడా ఉన్న‌ది. అగ్నిప్ర‌మాదానికి ఇంకా కార‌ణం తెలియ‌రాలేదు.  దీనిపై పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు.